పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!
- దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు
- దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు
- ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి
- పారదర్శక విచారణకు డిమాండ్
- కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
- హత్య కేసు నమోదు
ఆస్ట్రేలియా నుంచి పాకిస్థాన్‌కు హాలిడే ట్రిప్ కోసం వచ్చిన ఒక ప్రవాస కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో సాయుధ దొంగల (Dacoits) ముఠా వీరి కారును ఆపి, అందులోని కుటుంబాన్ని బందీలుగా చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగగా, దొంగలు పోలీసులపైకి కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరుపుతున్న ఒక పోలీస్ అధికారి.. దొంగల కారు అనుకుని పొరపాటున బాధితుల వాహనంపైనే కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల ఆస్ట్రేలియా పౌరురాలు 'హనియా అహ్మద్' బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జూన్ 10న జరిగిన ఈ ఘటనలో చిన్నారి తండ్రి అదీల్ అహ్మద్ (39), అన్నయ్య ఆఫాన్ అహ్మద్ (11)లు తీవ్రంగా గాయపడగా, తల్లి డాక్టర్ సిద్రా ఖాన్ ప్రాణాలతో బయటపడ్డారు. పెర్త్‌లోని ఆస్ట్రేలియన్ ఇస్లామిక్ కాలేజీలో చదువుతున్న హనియా మృతిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరపాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, నిర్లక్ష్యంగా కాల్పులు జరిపిన సదరు పోలీస్ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, హత్య కేసు కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గాయపడిన తండ్రి, కొడుకు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.